7th Pay Commission: ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు, త్వరలోనే 3 DA, ఇతరత్రా అలవెన్సులు
యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 7వ వేతన సవరణ సంఘం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది.
7వ వేతన సవరణ సంఘం, జేసీఎం నేషనల్ కౌన్సిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు రావాల్సిన కొత్త అలవెన్స్, సవరించిన వేతనాలను కొంతకాలం పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు బకాయిలు, సవరించాల్సిన అలవెన్సులు అందుతాయని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(AICPI) విడుదల చేసిన సమాచారం ప్రకారం జనవరి 2021 నుంచి జూన్ నెల కాల వ్యవధికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. జనవరి 2020 నుంచి ఉద్యోగులకు డీఏ సంవరించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల డీఏ, డీఆర్ ఇతర అలవెన్సులు సవరించలేదు. వీరికి మొత్తం దఫాల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. డియర్‌నెస్ అలవెన్స్‌ను 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Central Government Employees)కు వేతనాలు భారీగా పెరగనున్నాయని శుభవార్తను అందించారు. ఇందులో భాగంగ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం నుంచి 28 శాతానికి పెరగనుందని సమాచారం. తవ్వారా ఉద్యోగుల వేతనాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతాయిని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేశారు.
జనవరి 1, 2020 నుండి జూన్ 2020 వరకు 3 శాతం DA ఉద్యోగులకు రావాల్సి ఉంది. అదే విధంగా జూలై 1, 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్, ప్రస్తుతం జనవరి 1, 2021 నుండి జూన్ 2021 కాలానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మూడు పెండింగ్ డీఏలు కలిపితే ఓవరాల్‌గా 11 శాతం ఉద్యోగులు అందుకోనున్నారు. తద్వారా 17 శాతం డీఏ 28 శాతానికి చేరనుంది. జూలై వేతనంతో సవరించి కొత్త జీతాలు అందనున్నాయి.