7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..
అలాగే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డి ఏ ని పెంచితే ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు కూడా అద్భుతమైన ప్రయోజనం చేకూరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పే కమిషన్ లెక్కల ప్రకారం డిఏ పెరిగితే దాదాపు భారతదేశంలో ఒక కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనాన్ని పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 50% పైగా DAను పెంచినట్లు సమాచారం. అంతేకాకుండా జూన్ నెలలో AICPI ను కూడా 1.5 పాయింట్లను పెంచినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే DA మూడు శాతంకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం DA పెంచితే దీనిని 2024 సంవత్సరం జూలై నుంచి ఉద్యోగులు పొందుతారు. ఇప్పటివరకు AICPI దాదాపు 141. 4 పైగానే పెరిగింది. ఇక DA స్కోర్ విషయానికొస్తే.. 50. 84 శాతం కు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే అతి త్వరలోనే ఈ లెక్కల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడవ వేతన సంఘం (7Th Pay Commission) ప్రకారం ఉద్యోగులకు ఈ నెలలో మరోసారి డిఎని ప్రకటిస్తే.. ఇది 2024 సంవత్సరం జూలై నుంచే హరియర్స్ గా అమలవుతుంది. దీంతో ఈ సంఘం ప్రకారం పెన్షనర్లకు డి ఏ ను దాదాపు 53% చెల్లించే అవకాశాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన జరిపే కేబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన డీఏ గురించి కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డీఏ ప్రకటించాలనేది వెల్లడించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల DAను మూడు శాతం వరకు పెంచితే జీతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లెక్కల ప్రకారం చూస్తే... ఉద్యోగి జీతం 40 వేలకు పైగా ఉంటే.. DA మూడు శాతం పెరిగితే దాదాపు రూ.1200 పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం దాదాపు రూ.14,400 పైగా పెరుగుతుందని తెలుస్తోంది.
అయితే చాలామంది డిఎ(DA) జీరో అవుతుందని అనుకుంటూ ఉంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం DA సున్నా అవడం చాలా అరుదు.. ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లెక్కింపు 50 శాతానికి మించే ఉంటున్నట్లు తెలుస్తోంది.