Diwali Bonus: సర్కార్ ఉద్యోగులకు శుభవార్త.. దీపావళికి ముందే 4 శాతం DAతో పాటు ఊహించని బోనస్..
ముఖ్యంగా ఈ డీఏ పెరిగితే కొన్ని లక్షల పెన్షన్ దారులకు భారీగా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే ఈ డియర్నెస్ అలవెన్స్‌ని పెంచడానికి సన్నాహాలు చేసేందుకు చర్చులు కూడా జరుపుతోంది.
ఒక వేళ ఈ డీఏ పేరితే కొన్ని కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే డియర్నెస్ అలవెన్స్‌తో పాటు జీతాలు పేరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తమ రాష్ట్ర ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌ను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
యూపీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏ నుంచి ఏకంగా 4 శాతంకు పైగా పెంచబోతున్నట్లు అధికారిక సమాచారం. అంతేకాకుండా నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్‌ను కూడా అందించబోతున్నట్లు యూపీ సర్కార్ భావిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది దీపావళికి ముందే డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుతుందని, ఈ ఏడాది కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హరి కిషోర్ తివారీ వెల్లడించారు.
ఇప్పటికే ఈ DA గురించి ప్రభుత్వంలో చర్చలు జరిపిట్లు దీవాళి లోపే ఉద్యోగుల ఖాతాల్లోకి బోనస్‌తో పాటు డియర్నెస్ అలవెన్స్ పడే అవకాశాలు ఉన్నట్లు హరి కిషోర్ తివారీ తెలిపారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎడవ వేతర సంఘానికి సంబంధించిన ఉద్యోలకు కరువు భత్యాన్ని కూడా 4 శాతం పెంపుపై ఆమోదం ఇచ్చారు. దీని కారణంగా దాదాపు 8 లక్షలకుపై పెన్షనరులకు ప్రయోజనం లభించినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో పెంచిన DA ప్రభుత్వం జనవరి 1 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. దీని కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ప్రయోజనాలు పొందినట్లు సమాచారం..