7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. 7వ వేతన సంఘం నుంచి జీతాల పెంపు కోసం ఎదరుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ హెల్త్ స్కీమ్, మెడికల్ క్లెయిమ్ విషయంలో ఊరట లభించింది. సీజీహెచ్ఎస్ జాబితాలో లేని ఆసుపత్రిలో ఉద్యోగులు, లేక పింఛన్‌దారులు చికిత్స తీసుకున్నా వారికి మెడిక్లెయిమ్ (Mediclaim)ను తిరస్కరించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్
CGHS జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల జాబితాలో లేని ఆసుపత్రి నుండి అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చికిత్స పొందవచ్చు. వారితో పాటు పెన్షనర్లకు సైతం మెడిక్లెయిమ్ వర్తిస్తుందని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
చికిత్స అందిస్తున్న ఆసుపత్రి పేరు ప్రభుత్వం సూచించిన ఆసుపత్రుల జాబితాలో లేదు అనే కారణంతో వైద్యాన్ని తిరస్కరించరాదని జస్టిస్ ఆర్.కె.అగర్వాల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాపడింది.
Also Read: ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి
ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ చేసిన మెడిక్లెయిమ్ దావా ధృవీకరించబడిన వైద్యుడు లేదా ఆసుపత్రిలో ఉందా లేదా అని ప్రభుత్వం పరిశీలించాలి. ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్లు నిజంగానే చికిత్స తీసుకున్నారా అనే వివరాలను ప్రభుత్వం ధృవీకరించగలదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ వివరాల ఆధారంగా మెడిక్లెయిమ్ మంజూరు చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మెడిక్లెయిమ్ పొందడంపై మాజీ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించారు. అతడు రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు తెలిపి, తనకు మెడిక్లెయిమ్ రీయింబర్స్‌మెంట్ అందించాలని డిమాండ్ చేశాడు.