7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. ఒకేసారి డబుల్ బొనంజా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతుంది. మొదటి పెంపు జనవరిలో, రెండో పెంపు జూలై నెలలో ఉంటుంది.
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెరిగింది. దీంతో డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతానికి చేరింది.
AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా మరోసారి ఉద్యోగులకు 4 శాతం పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 54 శాతానికి చేరనుంది.
అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 8వ వేతన సంఘం ప్రవేశపెడుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. పదేళ్లకు ఒకసారి కొత్త పే కమిషన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డీఏ 50 శాతం దాటితే.. ఆ భత్యాన్ని మొత్తం బేసిక్ పేలో కలిపేసి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారు. ఈ విషయంపై లోక్‌సభ ఎన్నికల తరువాత క్లారిటీ రానుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను AICPI ఇండెక్స్ ఆధారంగా పెంచుతున్న విషయం తెలిసిందే.
గమనిక: ఇక్కడ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే రాసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను చెక్ చేయండి.