7th Pay Commission Latest News: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం
తెలంగాణ తరహాలోనే తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 59కి పెంచుతుంది. 7వ సీపీసీ ప్రోత్సాహకాలు అందించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె పళనిస్వామి సిద్ధంగా ఉన్నారు.
పదవీ విరమణ వయస్సును పెంచడంలో భాగంగా 59 సంవత్సరాల నుండి 60కి పెంచినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులు, పీఎస్‌యూ సిబ్బందికి పదవీ విరమణ వయస్సును 60కి పెంచింది.
Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, మిశ్రమంగా Silver Price
110 వ నిబంధన ప్రకారం అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులు, మరియు సహాయక విద్యాసంస్థలు, పీఎస్‌యూలు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి పదవి విమణ వయసు అమలులోకి రానుంది. మే 31, 2021న పదవీ విరమణ చేసే వారికి సైతం వర్తించేలా చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తరహాలోనే పళనిస్వామి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు
ప్రభుత్వ మరియు సహాయక విద్యాసంస్థలు, పిఎస్‌యులు మరియు స్థానిక సంస్థలు మరియు 2021 మే 31న పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు. అయితే గత ఏడాది 58 నుంచి 59కి పెంచగా.. తాజాగా మరో ఏడాది అవకాశం కల్పించింది.
Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె పనళనిస్వామి ప్రకటించారు. దీని అమలు కోసం ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పదవీ విరమణ వయసు పెంచాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read: Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి