7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!

Sat, 03 Aug 2024-6:36 pm,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2024కి సంబంధించిన జీతాల పెంపు ప్రకటన త్వరలోనే ఉండనుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరింది. తదుపరి డీఏ ఎంత పెంచినా 50 శాతం దాటిపోతుంది. దీంతో డీఏ 50 శాతం దాటితే జీరోకి తగ్గిస్తారా అనే చర్చ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మొదలైంది.   

7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. ఏ దశలోనూ బేసిక్ పేతో డీఏను లింక్ చేయాలనే సిఫారసు లేదని ఇప్పటికే బిజినెస్ లైన్ నివేదిక వెల్లడించింది. దీంతో తరువాత నుంచి డీఏ, డీఆర్ 'సున్నా' వద్ద ప్రారంభం కాదని పేర్కొంది. రెగ్యులర్ ప్రాతిపదికన 50 శాతానికి మించి కొనసాగుతుందని నివేదిక తెలిపింది.  

HRAలో సవరణ కారణంగా డీఏను సున్నాకి తగ్గించడంపై చర్చ మొదలైంది. డియర్‌నెస్ రేటును ఏకీకృతం చేయడానికి 7వ వేతన సంఘం ఒక విధానాన్ని రూపొందించింది. అయితే కచ్చితంగా పాటించాలనే నిబంధన లేదు. డీఏ 50 శాతానికి చేరుకున్నప్పుడు హెచ్‌ఆర్‌ఏను అంచనా వేయాలనే నిబంధన ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

డీఏ 50 శాతం దాటితే జీరో చేయాలనే విషయంపై నిర్దిష్ట నిబంధన లేకపోవడంతో కొత్త డీఏ లెక్కింపు జీరో నుంచి ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతతోంది. జనవరి నుంచి జూన్ వరకు డేటా ఆధారంగా జూలై నెలకు సంబంధించిన డీఏ పెంపు ఉండనుంది.  

ఇప్పటివరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు డేటా విడుదల అవ్వగా.. జూన్ నెల డేటాను రిలీజ్ చేయాల్సి ఉంది.   

జనవరిలో AICPI ఇండెక్స్ 138.9 పాయింట్ల వద్ద ఉండగా.. డీఏ 50.84 శాతానికి పెరిగింది. మే నెల వరకు 52.91 శాతానికి చేరింది. జూన్‌లో సూచీ 0.7 పాయింట్లు పెరిగినా.. అది 53.29 శాతానికి మాత్రమే చేరుతుందని డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

గత నాలుగు సార్లు కూడా డీఏను నాలుగు శాతం చొప్పున పెంచారు. మరోసారి డీఏను 4 శాతం పెంచాలంటే ఇండెక్స్ 143 పాయింట్లకు చేరుకోవాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. మొత్తం డీఏ 53 శాతానికి పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.   

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.        

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link