7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!
డీఏ 3 శాతం పెంపుతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,448.35 కోట్ల అదనపు భారం పడనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెరిగినా.. కొంత నిరాశలోనే ఉన్నారని చెప్పొచ్చు. డీఏ 50 శాతం దాటినా బేసిక్ పేలో అనుసంధానం చేయకపోవడంతో జీతాలు ఆశించిన స్థాయిలో పెరగవని నిపుణులు చెబుతున్నారు.
5వ వేతన సంఘం ప్రకారం.. బేస్ ఇండెక్స్ కంటే వినియోగదారుల ధరల సూచిక 50 శాతం పెరిగితే డీఏను లింక్ చేయాలి. ఈ విధానం ఫిబ్రవరి 27, 2004న అమలు చేశారు.
అయితే 6వ కేంద్ర వేతన సంఘం అమలుతో రూల్స్ మారిపోయాయి. బేసిక్ పేలో డీఏను లింక్ చేయాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది.
7వ వేతన సంఘంలో కూడా ఇదే విధానం అమలు అవుతోంది. బేసిక్ పేతో డీఏను లింక్ చేస్తే.. ఉద్యోగుల మూలవేతనం భారీగా పెరుగుతుంది. దీంతో వారికి వచ్చే చెల్లింపులు కూడా పెరుగుతాయి.
డీఏ 50 శాతం చేరితే.. ట్రావెల్ అలవెన్స్, వసతి భత్యం, డ్రెస్ అలవెన్స్ 25 శాతం స్థిరంగా పెరుగుతాయి.
ఒక ఉద్యోగి జీతం రూ.30 వేలు అనుకుంటే.. బేసిక్ పే రూ.18,000 ఉంటే.. ప్రస్తుతం డీఏ కింద రూ.9 వేలు అందుకుంటున్నారు. ఇది బేసిక్ పేలో 50 శాతం అవుతుంది.
తాజాగా 3 శాతం డీఏ పెంపుతో నెలకు రూ.9,540 అందుకుంటారు. అంటే నెలకు రూ.540.. ఏడాదికి రూ.6,480 పెరగనుంది.
బేసిక్ పే రూ.50 వేలు ఉన్న ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపుతో నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేల జీతం పెరగనుంది.