7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 3 బంపర్ బహుమతులు, డీఏ, జీతం పెంపుతో పాటు ఎరియర్లు
పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు సబ్సిడీ ఉంటుంది. ఇదే డీఏ పెంపు. కేంద్ర కార్మిక శాఖ సూచీ ఆధారంగా ఉంటుంది.
డీఏ 3 శాతం పెరిగితే కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి 540 రూపాయలు డీఏ పెరుగుతుంది. దాంతో ఏడాదికి 6,480 రూపాయలు అదనంగా పెరుగుతుంది. డీఏ పెంపుతో 56,900 రూపాయలు కనీస వేతనం ఉండేవారికి అదనంగా 20,484 రూపాయలు పెరుగుతాయి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ఏడాదికి రెండు సార్లు జనవరి, జూలై నెలల్లో పెంచుతుంటారు. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ఆధారంగా డీఏ ఎంతనేది నిర్ణయిస్తారు.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల ఎరియర్లతో పాటు సెప్టెంబర్ నెల జీతం భారీగా అందనుంది. అంటే దసరాకు ముందే ఉద్యోగులకు పెద్ద ఎత్తున డబ్బులు అందనున్నాయి.
డీఏ పెంపు ఎప్పుడు ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా చూస్తున్నారు. సెప్టెంబర్ అంటే ఈ నెల మూడవ వారంలో డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు. డీఏ 4 శాతం పెంచవచ్చని కొందరి అంచనా.
జూలై నుంచి డీఏను 3 శాతం పెంచితే ఉద్యోగుల డీఏ 53 శాతానికి , పెన్షనర్ల డీఆర్ 53 శాతానికి చేరవచ్చు. దాంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
7th Pay Commission DA & Salary Hike
జూలై 2024 డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉండవచ్చు. అంతకుముందు జనవరిలో 4 శాతం పెరగడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. పెన్షనర్లకు డీఆర్ 50 శాతం అందుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డీఏ పెంపు ఈ నెలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మూడో వారంలో డీఏ పెంపు ప్రకటన జారీ కావచ్చు.
7th Pay Commission DA & Salary Hike
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ పెంపుపై ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission DA & Salary Hike: జూలై నెల డీఏ పెంపు నిర్ణయం ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో ప్రకటన జారీ అయినా జూలై నుంచి ఎరియర్లతో సహా అందిస్తారు. అంటే సెప్టెంబర్ నెల జీతంతో భారీగా డబ్బులు అందనున్నాయి.