Extra Pension Benefits: పెన్షనర్లకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, కీలక మార్పులు, వయస్సు దాటితే అదనపు పెన్షన్
2019లో పెన్షన్ అదాలత్ 5,277 కేసులు చేపట్టగా అందులో 3,573 కేసులు పరిష్కరించింది. అంటే 67 శాతం సక్సెస్ రేటు సాధించింది.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక ఫిర్యాదులను సకాలంలో పూర్తిగా పరిష్కరించేందుకు పెన్షన్ అదాలత్ ఉంది. 2019లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి పెన్షనర్ల ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి.
80-85 ఏళ్ల వయస్సు కలిగినవారికి ప్రాధమిక పెన్షన్‌లో 20 శాతం, 85-90 ఏళ్లుంటే ప్రాధమిక పెన్షన్‌లో 30 శాతం, 90-95 ఏళ్ల వయస్సు కలిగితే ప్రాధమిక పెన్షన్‌లో 40 సాతం, 95-100 ఏళ్లుంటే ప్రాధమిక పెన్షన్ నుంచి 50 శాతం, 100 ఏళ్లు అతకంటే ఎక్కువ ఉంటే ప్రాధమిక పెన్షన్ నుంచి 100 శాతం అదనంగా లభిస్తుంది.
పెన్షనర్లకు ఆర్ధికంగా మరింత సెక్యూర్ చేసేందుకు పెన్షన్లు, కుటుంబ పెన్షన్లలో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న వివిధ వేతన సంఘాల సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాురు. వివిధ పే రివిజన్ కమీషన్లలో ఈ విషయాన్ని చర్చించారు. ఇది వయస్సుని బట్టి ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ అదనపు పెన్షన్ పెరగనుంది
3వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘం వరకూ పెన్షనర్లకు సంస్కరణలు, అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.