DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా డీఏ ఎరియర్లు కూడా
7వ వేతన సంఘం ప్రకారం డియర్‌నెస్ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. డీఏ ఎవరికి ఎంత పెరుగుతుంది, డీఏ బకాయిలు కూడా అందనున్నాయా లేదా అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జూలై 2024కి డీఏ 3-4 శాతం ఉంటుందని అంచనా. ఎప్పటిలా 4 శాతం కాకుండా ఈసారి 3 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అంటే మొత్తం డీఏ 53 శాంతం కానుంది. 4 శాతం పెరిగితే మాత్రం 54 శాతమౌతుంది.
డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు విడుదలైనా సరే జూలై నెల నుంచి లెక్కించి ఎరియర్లతో పాటు అందించనున్నారు. అంటే అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు.
అన్నింటికీ మించి కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా నిలిపివేసిన 18 నెల డీఏ బకాయిలు విడుదల చేయాలని చాలాకాలంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇవి దీపావళి కానుకగా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
కానీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 18 నెలల బకాయిలు విడుదల చేసే ఆలోచన లేదనే చెప్పారు. అయితే దసరా సందర్భంగా 70 లక్షలమంది ఉద్యోగులకు ఆ డబ్బులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనప్పటికీ.. దీపావళికి ముందు జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేలుండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 540 రూపాయలు ఏడాదికి 6,480 రూపాయలు పెరుగుతుంది. అదే 4 శాతం పెరిగితే నెలకు 720 రూపాయలు ఏడాదికి 7440 రూపాయలు పెరుగుతాయి.
ఇక నెలకు 50 వేలు కనీస వేతనం ఉండి డీఏ 3 శాతం పెరిగితే నెలకు 1500 రూపాయలు ఏడాదికి 18 వేలు అందుతాయి. ఉద్యోగుల స్థాయి కనీస వేతనం బట్టి ఎవరికి ఎంత పెరుగుతుందనేది ఉంటుంది.