Tirumala: తిరుమలకు కాలినడకన వెళ్లడానికి 8 మార్గాలు ఉన్నాయని తెలుసా.. అవేమిటంటే!

Sun, 01 Dec 2024-7:31 pm,

తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లడానికి ఒకటి అలిపిరి మెట్ల మార్గం ఇంకొకటి రోడ్డు మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ కాలి నడకన వెళ్లే వారికి 8 మార్గాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.  అందులో మొదటిది అలిపిరి మెట్లు.. మనందరికీ బాగా తెలిసిన దారి. తిరుమల వెంకటేశ్వరుడిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు.  మొత్తం 3550 మెట్లు ఉంటాయి.

రెండవది శ్రీవారి పాదాలు.. శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు మొదటి పాదం ఇక్కడే పెట్టారని చెబుతారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. 

మూడవ మార్గం మామండూరు.. తిరుమలకు వెళ్లే వాటిల్లో మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్య దిక్కున ఉంటుంది. దీనికి మించిన దారి ఇంకొకటి లేదు అంటారు పూర్వీకులు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల సౌకర్యార్థం రాతిమెట్లను కూడా ఏర్పాటు చేశారు. 

నాల్గవ మార్గం శ్యామలకోన.. తిరుమల కొండకు పశ్చిమాన కళ్యాణీ డ్యామ్ ఉంటుంది. దానిని ఆనుకొని శ్యామలకోన ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్ళవచ్చు.  ఐదవ మార్గం కళ్యాణీ డ్యామ్ మలుపు..కళ్యాణి డామ్ వద్ద నుండి దారి గుండా మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పు వైపు తిరిగి మరి కొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. 

ఆరవ మార్గం కుక్కల దొడ్డి..కడప సరిహద్దుల్లో చిత్తూరు ప్రారంభంలో కుక్కల దొడ్డి అనే ఒక ప్రాంతంలో తుంబురుతీర్థం, పాప వినాశనం మీదుగా తిరుమలకు వెళ్ళవచ్చు. ఏడవ మార్గం అవ్వా చారి కోన.. అన్నింటిలో ఏడవదారి అవ్వా చారి కోన. ఈ దారి గుండా వెళ్తే కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. ఇది రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం నుండి తిరుమలకు చేరుకోవచ్చు. 

ఎనిమిదవ మార్గం ఏనుగుల దారి.. ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి కాబట్టి ఆ పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గాన చేరవేసారట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link