8 Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రూ.26 వేలకు జీతం పెంపు.. పూర్తి వివరాలు ఇవే!
ఇప్పటికే ఈ 8వ వేతన సంఘం కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే దీనిపై కేంద్ర పలువు ఆర్థిక నిపుణులతో చర్చులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కమిషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు...
కానీ ఈ 8వ వేతన సంఘం గురించి ఉద్యోగ సంఘల్లో భారీగా చర్చ నడుస్తోంది. అంతేకాకుండా AIRF (All India Railwaymen Federation) ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్ర స్పందించారు.. కేంద్రం 2026 సంవత్సరంలో ఈ వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం 8వ వేతన సంఘాని(8 pay commission)కి సంబంధించిన ముసాయిదాను 2026 జనవరి మొదటి వారంలో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేతన సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం 2014లో 7వ వేతన సంఘాన్ని అమలు చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ (8 pay commission) పే కమీషన్స్‌ను ప్రకటిస్తూ వస్తోంది. అయితే 8 పే కమీషన్ కేంద్రం 2024 సంవత్సరంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు.. ఇది 2026 సంవత్సరంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
అంతేకాకుండా 7వ వేతన సంఘం పూర్తికాక ముందే ఎప్పటి నుంచో 8వ వేతన సంఘానికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని కారణంగా జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని శివగోపాల్ మిశ్ర తెలిపారు..
8వ వేతన సంఘం (8 pay commission) పూర్తిగా అమల్లోకి వస్తే, దాదాపు 1 కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పెరుగుతున్న వస్తువుల ఖర్చులు కలిసచ్చే అవకాశాలు ఉన్నాయి..
ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా కేంద్ర మార్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని 3.68 రెట్టుగా మారుస్తున్నట్లు AIRF (All India Railwaymen Federation) ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్ర తెలిపారు. దీని కారణంగా బేసిక్ పే ఎకంగా దాదాపు రూ.26 వేలకు పైగా పెరుగుతుంది...
ఈ 8వ వేతన సంఘం (8 pay commission) అమల్లోకి వస్తే దాదాపు జీతాలు ఒక్కసారిగా 20 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఊహించని స్థాయిలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..