8th Pay Commission Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, భారీగా పెరగనున్న జీతాలు, ఎప్పుడంటే
మొత్తానికి 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా ఆశలున్నాయి. వచ్చే బడ్జెట్‌లో ప్రకటన వెలువడి 2026 నుంచి అమల్లోకి వస్తే భారీగా జీతభత్యాలు పెరగనున్నాయి.
8వ వేతన సంఘం ఏర్పాటుతో 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు ఉన్న ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగవచ్చు
అదే విధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.62 శాతంగా ఉంది. దీనిని 3 శాతం నుంచి 3.68 శాతం వరకు పెంచాలని డిమాండ్ ఉంది. అంటే జీతభత్యాలు 15-20 శాతం పెరగవచ్చు
8వ వేతన సంఘం అమలైతే పెన్షనర్లు కూడా భారీగా లబ్ది పొందనున్నారు. ప్రస్తుతం కనీస పెన్షన్ 9 వేలు వస్తోంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే 17,280 రూపాయలకు పెరగనుంది. గరిష్ట పెన్షన్ 1 లక్ష 25 వేల నుంచి 2 లక్షల 40 వేలకు పెరుగుతుంది.
8వ వేతన సంఘం అమలైతే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది. ఇక పై స్థాయిలో ఉన్నవారి గరిష్ట వేతనం 92 శాతం పెరిగి 4 లక్షల 80 వేలకు చేరనుంది.
2025 ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో 8వ వేతన సంఘంపై ప్రకటన వెలువడవచ్చు. అమలు చేసేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టనుంది. అంటే 2026 నుంచి అమల్లోకి రావచ్చు. కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఆర్ధిక పరిస్థితులు మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వేతన సంఘమే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను సమీక్షిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటు కాగా, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే 8వ వేతన సంఘం 2025 బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అద్దిరిపోయే వార్త. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిక 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశముండటంతో భారీగా కనీస వేతనంతోపాటు డీఏ ఇతర ప్రయోజనాలు కూడా పెరగనున్నాయి.