8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!
7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మోదీ 3.O బడ్జెట్‌లో ప్రకటన వస్తుందని కొండంత ఆశలు పెట్టుకోగా.. తీవ్ర నిరాశ ఎదురైంది.
8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ఆర్థిక శాఖకు కేంద్రానికి లేఖలు రాశాయి. కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే.. ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని కోరాయి.
ఇదిలా ఉండగా.. 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. కొత్త వేతన కమిటీ ఏర్పాటు కోసం ఉద్యోగుల సంఘాల నుంచి ప్రభుత్వానికి లేఖలు, వినతులు అందాయని పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రెండు లేఖలు వచ్చాయని ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
గతంలో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 8వ పే కమిషన్ అమలులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు. 8వ వేతన సంఘం జనవరి 1, 2026న గడువు ముగియనుందని... మనం ఇప్పుడు 2024లో ఉన్నామన్నారు. ఆయన వ్యాఖ్యలు తరువాత వచ్చే ఏడాది కొత్త పే కమిషన్‌కు సంబంధించి ప్రకటన ఉంటుందని ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది. కేంద్రం ఇప్పటివరకు 7పే కమిషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2014లో ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత అంటే 2016లో ఈ కమిటీ సిఫార్సులు అమలులోకి వచ్చాయి.
కేంద్రం ప్రస్తుతం 8వ వేతన సంఘం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఏర్పాటు చేసినా.. అది 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 రెట్లు ఫిట్‌మెంట్‌ను అందుకుంటున్నారు. దీన్ని 3.68 రెట్లకు పెంచాలన్న డిమాండ్ చేస్తున్నారు.
8వ వేతన సంఘం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెరుగుదల ఉంటుంది. దాదాపు జీతంలో 44 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఎ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఎ) వంటి వాటిల్లో బంపర్ పెరుగుదల ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.