Unified Pension Scheme: 2025 నుంచి పెన్షన్ మార్పులు.. కొత్త లాభాలు ఇవే..!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్న.. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) గురించి ప్రకటించిన.. సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ప్రస్తుతం అమలులో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతోంది. 2004లో ప్రవేశపెట్టిన NPSను తొలగించి.. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను పునరుద్ధరించాలను చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కూడా పాత పెన్షన్ స్కీమ్ (OPS) లానే ఉద్యోగులకు గ్యారంటీడ్ పెన్షన్ అందిస్తుంది. ఉద్యోగి చివరి 12 నెలల సగటు మౌలిక వేతనంలో.. 50% పెన్షన్ అందించే విధంగా UPS పనిచేస్తుంది. అలాగే ఈ స్కీమ్ కింద కనీసం 10 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగిన ప్రతి రిటైరీకి కనీస పెన్షన్ రూ.10,000 పొందేలా ఉంటుంది. ఒకవేళ పెన్షనర్ మరణించినట్లయితే.. అతని/ఆమె జీవిత భాగస్వామికి 60% పెన్షన్ అందజేయబడుతుంది.
UPS కింద కనీస పెన్షన్ ఎంత ఉంటుంది?
ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస పెన్షన్ రూ.9,000గా ఉంది, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి కనీస మౌలిక వేతనం (బేసిక్ + DA) రూ.18,000గా ఉంది. అయితే 2026లో అమలులోకి రాబోయే.. 8వ వేతన కమిషన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం కింద వేతన సవరణలు 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా అమలు చేయబోతున్నారు.
ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ.34,560గా నిర్ణయించే అవకాశముంది. కనీస వేతనాన్ని.. రూ.34,560గా తీసుకుంటే, UPS కింద ప్రాథమిక పెన్షన్ రూ.17,280గా ఉంటుంది. కనీసం 25 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగిన వారికి.. కనీసం రూ.17,280 పెన్షన్ అందేలా UPS పనిచేస్తుంది.
పెన్షన్ మొత్తాన్ని చివరి 12 నెలల సగటు మౌలిక వేతనం ఆధారంగా లెక్కిస్తారు. కనుక డిఏ విలీనం.. లేదా ఇతర కారణాల వల్ల కనీస వేతనంలో మార్పులు జరిగితే, పెన్షన్ మొత్తం కూడా మారే అవకాశం ఉంటుంది.
UPS వల్ల ఎవరు లాభం పొందుతారు?
UPS కింద 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులు (ఆర్మ్డ్ ఫోర్సెస్ కాకుండా) అందరూ లాభం పొందగలరు. కేంద్ర స్థాయిలో UPS అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఇది అమలు అవుతుంది. అయితే, ఇటీవల చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా BJP అధికారంలో లేని రాష్ట్రాలు, పాత పెన్షన్ స్కీమ్ (OPS) వైపు మొగ్గు చూపుతున్నాయి.
UPS యొక్క లాభాలు:
గ్యారంటీడ్ పెన్షన్: రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల సగటు మౌలిక వేతనంలో 50% పెన్షన్.
కుటుంబ పెన్షన్: ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబ సభ్యులకు 60% పెన్షన్ అందించడం.
2025 ఏప్రిల్ 1 నుంచి UPS అమలు కానుంది. ఉద్యోగులు ప్రస్తుతం అమలులో ఉన్న NPS లేదా కొత్త UPS మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఒకసారి ఎంపిక చేసిన తర్వాత తిరిగి మార్చడం కుదరదు.