8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘంతో ఇన్ని లాభాలా, జీతభత్యాలు ఎంత భారీగా పెరుగుతాయో తెలుసా

అదే విధంగా 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస వేతనం 18 వేల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది. ఇక గరిష్ట వేతనం 4 లక్షల 80 వేలు కానుంది. ఇక పెన్షన్ అయితే 9 వేల నుంచి 17,280 రూపాయలకు పెరగనుంది. గరిష్ట పెన్షన్ 1,25,000 నుంచి 2,40,000 వరకూ పెరగనుంది.

7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం చేయగానే కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. పెన్షన్ 3500 నుంచి 9 వేలకు పెరిగింది.

ఉద్యోగుల జీతం, పెన్షన్ అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయిస్తుంటారు. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతముంది. 8వ వేతన సంఘం ఏర్పడితే 1.92 శాతం పెరగవచ్చని అంచనా. అదే జరిగితే జీతభత్యాలు పెద్దఎత్తున పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 8వ వేతన సంఘం ఎప్పుడనేది ప్రకటించకపోయినా 2025 ఫిబ్రవరి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన రావచ్చని అంచనా ఉంది. అంటే అమల్లోకి వచ్చేసరికి 2026 కావచ్చు. ఒకసారి అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్ భారీగా పెరగనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం పదేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పాటవుతుంది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడితే అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.