8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది
8వ వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది. అంటే ఏకంగా 92 శాతం పెరుగుతుంది. పెన్షనర్లకు కనీసం 17,280 రూపాయలు పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం. పెన్షన్లను 3.68 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా పెంచవచ్చని అంచనా ఉంది. 7వ వేతన సంఘం సమయంలో కూడా ఇదే అంచనా వేశారు కానీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం చేశారు. ఇప్పుడు 8వ వేతన సంఘం 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది.
8వ వేతన సంఘం ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతభత్యాలు మరోసారి భారీగా పెరగనున్నాయి.
డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటన తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ, డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడిక ఉద్యోగుల నిరీక్షణ 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉంది. ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘం ఏర్పడుతుంది. 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం..2016 నుంచి అమల్లోకి వచ్చింది.
8th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెరిగింది. అక్టోబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ మూడు నెలల ఎరియర్లతో కలిపి చెల్లించనున్నారు.