Rs 1000 tea: ఇక్కడ ఛాయ్ ఖరీదు రూ.1000.. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ?
కానీ ఇక్కడ లభించే ఛాయ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి.. ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఇక్కడి ఛాయ్‌కి అంత పాపులారిటీ ఏర్పడింది.
ఛాయ్‌ని ఛాయ్‌లా మాత్రమే కాకుండా ఛాయ్ ప్రియుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్ధప్రతిమ్ గంగూలీ అనే బెంగాలి వ్యక్తి 2014లో ఈ ఛాయ్ కొట్టును ప్రారంభించారు.
115 రకాల ఛాయ్‌లు ఇక్కడ లభిస్తాయంటున్నాడు పార్థ గంగూలీ. ఛాయ్ రెసిపి, అందులో వినియోగించే టీ పౌడర్, మసాలాలను బట్టి ఖరీదు మారుతుంది.
115 ఛాయ్ రకాలు ఉన్నప్పటికీ.. మస్కటెల్ టీ అనే సుగంధధ్రవ్యాలతో తయారు చేసే ఛాయకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు, కస్టమర్స్ కూడా ఎక్కువగా ఇష్టపడే ఛాయ్ అదే.
ఈ ఛాయ్ కొట్టు ప్రారంభించడానికి ముందుగా ఉద్యోగం చేసిన పార్థ గంగూలీ.. ఆ ఉద్యోగం మీద విసుగు చెంది ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో నీర్జాస్ టీ స్టాల్‌ను ఏర్పాటు చేసాడట. పార్థ గంగూలీ ఆలోచన నచ్చడంతో అతడి స్నేహితులు కూడా ఈ వ్యాపారానికి అండగా నిలిచారు. చాకోలెట్ టీ, వైట్ టీ, మెయిజ్ టీ, బ్లూ టీ లాంటి రకాల ఎన్నో ఛాయల రుచిని ఆస్వాదించొచ్చు.