Gardening Tips: మొక్కల పెరుగుదల కుంటుపడిందా? ఒక్క అరటిపండు తొక్కతో ఆరోగ్యంగా పెరుగుతుంది..
ఈ మొక్కలో పెరుగుదల కొద్ది రోజులు పాటు కుంటుపడిందంటే అరటిపండుతో దీనికి సహజమైన చిట్కా. ఎలాంటి విషపూరితమైన మందులు వాడకుండానే మొక్కలు స్పీడ్ గా పెరుగుతాయి కావాల్సింది కేవలం ఒక అరటిపండు తొక్క.
అరటిపండు తొక్క తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకుని వాటిని డబ్బాలోని నీళ్లలో వేసి ఒకరోజు పాటు అలాగే ఉంచాలి. ఈ నీటికి ఐదింతల సాధారణ నీళ్లు పోసి మొక్కలకు పోయండి.
ఈ నీటిని మొక్కలకు నీరు పోసే ముందు మాత్రమే కలిపి పోయాలి. ఇలా చేయడం వల్ల కుంటిపడిన మొక్క మళ్ళీ ఆరోగ్యంగా పెరుగుతుంది. పూల మొక్కలైతే పువ్వులు విపరీతంగా పూస్తాయి.
అరటిపండు తొక్కతో చేసిన నీటిని అన్ని మొక్కలకు ఉపయోగించవచ్చు. అయితే ఏ ఫర్టిలైజర్ ని అయినా ఉదయం సూర్యోదయం లోపు మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఫర్టిలైజర్ ఇవ్వకూడదు.
ఈ చలికాలం సీజన్ కాబట్టి తక్కువ మొత్తంలో ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ సమయంలో మొక్కలకు అతిగా నీరు పెట్టకూడదు. మొక్కకి ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఈ సమయంలో ఎక్కువ ఎప్పటికి అప్పుడు పచ్చని ఆకులను తొలగించండి.