Aadhi Pinisetty Engagement: సీక్రెట్‌గా నిశ్చితార్థం.. హీరో, హీరోయిన్‌ ఫోటోలు వైరల్‌!!

Sun, 27 Mar 2022-5:04 pm,

యంగ్‌ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ సీక్రెట్‌గా నిశ్చితార్థం  చేసుకున్నారు. 

'గుండెల్లో గోదారి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి..  సరైనోడు,నిన్ను కోరి, రంగస్థలం చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే గుడ్‌ లక్‌ సఖి చిత్రంలో నటించారు. 

'యాగవరైనమ్‌ నా కక్కా' అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ గల్రానీ నటించారు. ఈ చిత్రం తెలుగులోను 'మలుపు' పేరుతో వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. 

'2022 మార్చి 24న మా ఇద్దరికి ఎంతో స్పెషల్‌. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మీ అందరి ఆశీస్సులు కావాలి' అని తన ట్విటర్‌ ఖాతాలో నిక్కీ గల్రానీ ఫోటోలను షేర్‌ చేశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link