Ab De Villiers: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ టీమ్ కెప్టెన్‌గా డివిలియర్స్ రీఎంట్రీ

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్‌లో డివిలియర్స్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో రిటైర్డ్, నాన్-కాంట్రాక్ట్ ప్లేయర్లు పాల్గొంటారు.

క్రికెట్ కెరీర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడే ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్లకే డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతని అభిమానులు చాలా బాధపడ్డారు.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ తరపున మరో రెండేళ్లు ఆడాడు. 2021లో క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.
ఐపీఎల్‌లో డివిలియర్స్ ఆటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేశాడు. దాదాపు నాలుగు ఏళ్ల తరువాత డివిలియర్స్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌లోకి రానున్నడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం ఆడాలనే కోరిక లేకపోవడంతో తాను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యానని.. ఇప్పుడు తన పిల్లలు కూడా ఆడడం ప్రారంభించారని డివిలియర్స్ తెలిపాడు. తాను గార్డెన్‌లో తరుచుగా క్రికెట్ ఆడుతున్నానని.. ఇప్పుడు జిమ్, నెట్ ప్రాక్టీస్‌కు తిరిగి వెళ్తున్నానని చెప్పాడు. జూలైలో జరిగే WCL కోసం తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించాడు.
డివిలియర్స్ రాకతో గేమ్ ఛేంజర్స్ టీమ్ మరింత బలంగా మారనుంది. జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ వంటి దిగ్గజాలు ఈ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ సహ యజమాని & గేమ్ ఛేంజర్స్ వ్యవస్థాపకుడు అమన్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. డివిలియర్స్ తమ టీమ్ కెప్టెన్‌గా తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అతని నాయకత్వంలో కచ్చితంగా తమ టీమ్ దూసుకెళ్తుందన్నారు.