Sleeping Benefits: ఆధ్యాత్మికంగా ఉత్తర దిశలో తల పెట్టి ఎందుకు పడుకోకూడదు.. సైన్స్ చెబుతున్నది అదేనా..!

Mon, 26 Aug 2024-3:22 pm,

ఆధ్యాత్మికంగా ఉత్తర దిశలో తలపెట్టి పడుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. మన ధర్మ శాస్త్రాల ప్రకారం ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అలాగే దక్షిణానికి అధిపతి యముడు. ఇక ఉత్తర దిశలో తలపెట్టి పడుకొని లేచినపుడు దక్షిణ దిశ చూస్తారనే ఉద్దేశ్యంతో మన పెద్దలు ఆధ్యాత్మికంగా ఉత్తర దిశలో తలపెట్టి పడుకోకూడదని చెప్పింది.

సైన్స్ ప్రకారం మన భూమి తరంగాలు.. దక్షిణం నుంచి ఉత్తరానికి  నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ఉత్తరం దిశలో పడుకోవడం వల్ల మన రక్త ప్రసరణ వ్యతిరేక దిశలో కొనసాగడం వల్ల మనలో ఏది తెలియని నెగిటివ్ శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఒత్తిడికి నిద్ర సరైన మందు. చాలా సందర్భాల్లో ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఏ దిశలో నిద్రపోతామనే విషయమై అంతగా శ్రద్ధ చూపరు. కానీ వాస్తు శాస్త్రంలో ఎలా పడితే అలా పడుకోవడం నిషేధం.  ఇది తప్పుగా పరిగణించబడుతుంది.

నిద్రపోయేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అది వాస్తు దోషానికి కారణమవుతుంది.  ఇది జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. వాస్తు శాస్త్రంలో గృహ నిర్వహణకు మాత్రమే కాకుండా జీవనశైలికి కూడా దిశ ముఖ్యమైనదిగా భావిస్తారు.

కాబట్టి వాస్తు శాస్త్రంలో నిద్రించే దిశ కూడా ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది.  తప్పుడు దిశలో నిద్రపోవడం అక్కడ ఉండే వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

హిందూ మత గ్రంథాలలో, విశ్రాంతికి సంబంధించిన నియమాలు, సూత్రాలు పురాతన కాలం నుండి కొనసాగుతున్నాయి. దీని ప్రకారం, నిద్రపోయేటప్పుడు, మీ తల ఉత్తరం వైపు మరియు పాదాలు దక్షిణం వైపు అస్సలు ఉండకూడదు. హిందూ మతంలో, చనిపోయినవారిని మాత్రమే ఉత్తరం వైపు తల పెట్టి అంత్యక్రియలు చేస్తారు. తలను ఉత్తరం వైపు, పాదాలను దక్షిణం వైపు ఉంచడం ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని నమ్ముతారు. దీనికీ కారణం కూడా పైన ప్రస్తావించాము. దక్షిణం యమ స్థానం. అందుకే ఉత్తరాన పడుకునే వారు నిద్ర లేస్తే మొదట చూసేది దక్షిణ దిశ కాబట్టి  ఆ దిశలో నిద్రించకూడదని చెబుతారు.

హిందూ ధర్మ శాస్త్రం, వాస్తు శాస్త్రం యొక్క నియమాలు, సూత్రాలు శాస్త్రీయ ఆధారంగా ఉంటాయి.  అలాగే ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించడం తప్పు అని శాస్త్రంలో చెప్పబడింది. సైన్స్ ప్రకారం, అయస్కాంత ప్రవాహం దక్షిణం నుండి ఉత్తరం వరకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఉత్తరం వైపు తల ఉంచి నిద్రించడం వలన అయస్కాంత తరంగాలు తలలోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఇది మానసిక ఒత్తిడి, తలనొప్పి అనేక మెదడు సంబంధిత వ్యాధుల బారి పడేలే చేస్తుంది.

 

వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు తల ఉంచాలి. ఎందుకంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుని వైపు తల పెట్టి పడుకోవడం మానసిక, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే దక్షిణం వైపు తల పెట్టి నిద్రించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకపోవడమే బెటర్.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం ధర్మ శాస్త్రాలు, సైన్స్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link