Vastu Tips: ఈ సమయంలో ఇంటిని తుడిస్తే లక్ష్మీకటాక్షం, ఆర్థికసంక్షోభం నుంచి వెంటనే బయటపడతారు..

వాస్తు ప్రకారం కొన్ని సమయాల్లో ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంటిని తుడుచు కోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది. అందుకే ఇంట్లో సుఖః సంతోషాలు వెల్లివిరుస్తాయి. బ్రహ్మ ముహూర్తం దీనికి ఉత్తమ సమయం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ సమయంలో తుడిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి ఇంటి పురోగతికి బాటలు పడుతుంది. అంతేకాదు ఈ సమయంలో ఇల్లు శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి సౌరశక్తి పూర్తి ప్రయోజనం పొందుతారు.

అయితే, ఎల్లప్పుడు ఇంటిని తుడిచే సమయంలో మెయిన్ డోర్ నుంచి లేదా ఈశాన్య మూల నుంచి ప్రారంభించి నైరుతి దిశగా వెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతికూల శక్తి ఆనవాళ్లు కూడా ఇంట్లో కనిపించకుండా ఉంటాయి..
వాస్తు ప్రకారం ఇంటిని తుడిచేటప్పుడు ఆ బక్కెట్‌లో కాస్త రాతి ఉప్పును కూడా వేయడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇందులో నిమ్మరసం కలిపి శుభ్రం చేయడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
వాస్తు ప్రకారం ఇంటికి ఉపయోగించే బక్కెట్ రంగు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఇంటిని తుడిచే బక్కెట్ కూడా ఎరుపు రంగులో ఉండకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)