Anjana Sarja Boyfriend Photos: ప్రియుడుతో త్వరలో అర్జున్ రెండో కూతురు అంజనా పెళ్లి ? వైరల్ అవుతున్న పిక్స్..
రీసెంట్ గా అర్జున్ పెద్ద కుమార్తె వివాహాం నటుడు తంబీ రామయ్య కుమారుడితో గ్రాండ్ గా జరిగింది. ఐశ్యర్య హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
పెద్ద కూతురు పెళ్లి తర్వాత చిన్న కూతురు కూడా పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు. తాజాగా అంజనా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ విషయానికొస్తే..భారతీయ చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా దాదాపు 150పైగా చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ప్రస్తుతం మార్కెట్ తగ్గడంతో విలన్ పాత్రలపై ఫోకస్ పెట్టారు.
తాజాగా పెద్ద కూతురు పెళ్లి తర్వాత ఇపుడు రెండో కూతురు అంజనా కూడా పెళ్లి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఒకతనితో ప్రేమలో ఉంది. ఇతను ఐశ్వర్య పెళ్లిలో కూడా సందడి చేసాడు.
అక్క ఐశ్వర్య పెళ్లికి సంబంధించి ఫోటోలను అంజనా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో దిగిన ఫోటోల్లో తన అమ్మమ్మతో పాటు ఓ విదేశీయుడు కూడా ఉన్నాడు. దీంతో అతను అంజనా ప్రేమికుడా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అతను నటుడినా అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
మరి అతను అంజనా అర్జున్ బాయ్ ఫ్రెండా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.