Sumanth: రెండో పెళ్లి చేసుకోనున్న అక్కినేని సుమంత్.. వధువు ఎవరంటే..!

Wed, 30 Oct 2024-10:10 am,

అక్కినేని హీరో సుమంత్.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. హీరోగా ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని, ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు.. ఎదురవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు.. చేస్తూ కెరియర్ ను  ముందుకు తీసుకెళుతున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో చాలామంది వివాహం జరిగి.. మనస్పర్ధల కారణంగా  విడాకులు తీసుకుంటే.. ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతారు.  కానీ సుమంత్ మాత్రం తన భార్య నుంచి విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా మరో.. అమ్మాయికి తన హృదయంలో చోటు ఇవ్వలేదంటే ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ అమ్మాయిని సుమంత్ త్వరగా నే పెళ్లి చేసుకుని ఉన్నారు అనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో వినిపించింది.  

ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సుమంత్ ఆమె నుంచి విడిపోయారు.. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్.. కీర్తి రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ.. తాము విడిపోవడానికి కారణం అదే అంటూ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలోనే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి కదా అని ఈ హీరోని అడగా.. సుమంత్ మాట్లాడుతూ.. “గత వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. మరి భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో.. తెలియదు,” అంటూ సమాధానమిచ్చాడు. 

“కీర్తి రెడ్డికి కూడా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను తాను కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది.  అయితే మా వివాహం జరిగినప్పుడు మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేకపోవడం వల్లే మేము విడిపోయాము. మేము విడిపోవడానికి అదొక్కటే ప్రధాన కారణం.  ఒకరకంగా చెప్పాలి అంటే మా ఇద్దరి లైఫ్ సినిమా స్టోరీలా సాగింది,” అంటూ తెలిపారు సుమంత్. ప్రస్తుతం సుమంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సుమంత్ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో అనడంతో.. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ నిజమైన ఏమో అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. 

కీర్తి రెడ్డి విషయానికి వస్తే.. సుమంత్ నుంచి విడిపోయిన తర్వాత మరో వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు కీర్తి రెడ్డి కూడా తన అందంతో , నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ముఖ్యంగా మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ హీరోలకు అక్కగా కూడా నటించి అలరించింది.  అలా  సినిమాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని,  సుమంత్ ను వివాహం చేసుకున్న తర్వాత అతడి నుంచి బ్రేకప్ చెప్పుకున్న ఈమె.. ఆఖరికి ఇండస్ట్రీకి కూడా దూరమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link