Adah Sharma Hot Pics: షార్ట్ డ్రెస్‌లో ఆదా శర్మ.. వంగి మరీ అందాలన్నీ ఆరబోసిందిగా!
ఆదా శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. షార్ట్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. ఆదా హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే ఆదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఆదా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
టాలీవుడ్‌లో సన్నాఫ్ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రమణ్యం ఫర్ సేల్, కల్కి తదితర సినిమాల్లో నటించి ఆదా శర్మ ప్రేక్షకాదరణ పొందారు. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం అందుకోలేకపోయారు. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు.
2014లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో ఆదా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.
2008లో హిందీ హారర్ సినిమా 1920తో ఆదా శర్మ తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆపై హసే తో పసే (2014) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
1992 మే 11న ఆదా శర్మ ముంబైలో జన్మించారు. తమిళ బ్రాహ్మణ కుటుంబం చెందిన అదా నటి కావాలనే కోరికతో ఇంటర్ వరకు మాత్రమే చదివారు.