Priyanka Arul Mohan: చీరలో ప్రియాంక మోహన్.. పుత్తడి బొమ్మలా మెరిసిన బ్యూటీ..
నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమాలో ప్రియా క్యారెక్టర్ లో కనిపించి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
ఆ తరువాత వెంటనే శర్వానంద్ సినిమా శ్రీకారంలో కనిపించింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ రేంజ్ లో అయితే ఆడలేదు.
కాగా శివ కార్తికేయంతో తమిళంలో చేసిన వరుణ్ డాక్టర్ చిత్రం ప్రియాంకకు మొదటి సూపర్ సక్సెస్ అందించింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించింది.
ఇక అప్పటినుంచి తమిళంలో వరస అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది ఈ హీరోయిన్. మళ్లీ ఈ హీరోయిన్ శివ కార్తికేయంతో చేసిన డాన్ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.
ప్రస్తుతం మరొక తొమ్మిదో సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంకకు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ చిత్రంలో ఈ హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం విశేషం. అంతేకాకుండా నానితో సరిపోదా శనివారం సినిమాలో కూడా కనిపించనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ బ్లూ చీరలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.