Casting Couch: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నారు.. నా భుజంపై చేయి వేసి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇషా కొప్పికర్. బాలీవుడ్‌కు చెందిన ఈ భామ తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషల్లోనూ నటించింది.
తన 18 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన గురించి చెబుతూ.. ఓ నటుడు డ్రైవర్ లేకుండా తనను ఒంటరిగా కలవమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.
ఆ హీరోపై అప్పటికే చాలా రూమర్లు ఉన్నాయని.. ఆయన అడిగిన వెంటనే తాను నో చెప్పినట్లు వెల్లడించారు. ఆ టైమ్‌లో అతను బాలీవుడ్ స్టార్ హీరో అని తెలిపారు.
ఇండస్ట్రీలో పని నేర్చుకోవాలంటే హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలంటూ కొందరు సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భుజంపై చేయి వేసి అసభ్యంగా తాకేవారని చెప్పారు.
తన కాలంలో చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి దూరమయ్యారని.. కొందరు అమ్మాయిలు లొంగిపోగా.. కొందరు సినీ రంగాన్ని వదులుకున్నారని చెప్పారు.
అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండి పట్టు వదలని వారు చాలా తక్కువ ఉన్నారని.. వారిలో తానూ ఒకరని చెప్పుకొచ్చారు.
1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్ మూవీతో తెరంగేట్రం చేసిన ఇషా.. 2009లో టిమ్మీ నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.