Iswarya Menon Pics: ఐశ్వర్య మీనన్ ట్రెడిషనల్ అందాలు.. పట్టుచీరలో మెరిసిపోతుందిగా!

ఐశ్వర్య మీనన్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. పట్టుచీరలో చాలా అందంగా ముస్తాబయ్యారు. ఈ ఫొటోలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి.
ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.
'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.