Jacqueline Fernandez: ప్రకంపనలు రేపిన జాక్విలిన్ ఫెర్నాండెజ్.. బోల్డ్ ట్రీట్‌తో కుర్రకారుకు పండగే..!
శ్రీలంకకు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్‌గా రాణించి.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2009లో అల్లావుద్దీన్ మూవీతో వెండితెరపై మెరిసింది. ఆ తరువాత మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఓ వైపు హీరోయిన్‌గా సూపర్ హిట్స్ అందుకుంటూనే.. మరోవైపు ఐటం సాంగ్స్‌తో అలరించింది ఈ భామ.
తెలుగులో ప్రభాస్ సాహో సినిమాలో ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలోనూ ఈ శ్రీలంక బ్యూటీకి మొదట ఛాన్స్ దక్కిందట. అయితే అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణా మూవీలో రా.. రా.. రక్కమ్మ సాంగ్‌ను తన డ్యాన్స్‌తో మైమరిపించింది. ఈ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.