Jhanvi Kapoor: అందాలతో కునుకు లేకుండా చేస్తున్న దేవర బ్యూటీ..!
జాన్వి కపూర్ ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ల పెద్ద కుమార్తె. తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ తోనే ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తల్లి కోరిక మేరకు ఎన్టీఆర్ తో తన తొలి తెలుగు సినిమా చేసి సక్సెస్ అందుకుంది.
తొలిసారి 2018లో విడుదలైన ధడక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్రగామిగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే దేవర సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యింది.
వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె ఇంతకుముందు మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే క్రికెట్ సెంట్రిక్ హిందీ సినిమాలో కూడా నటించింది. రాజ్ కుమార్ రావు, జాన్వి జంటగా నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈమె పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకొని ప్రస్తుతం హిందీ, తెలుగు భాషా చిత్రాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన అంద చందాలతో మరొకసారి కునుకు లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.