Samanthas Myositis: సమంత జబ్బుతో నేనూ బాధ పడుతున్నా.. ఆమెకు థర్డ్ స్టేజ్.. కల్పిక సంచలనం!
Actress Kalpika Ganesh reveals Samantha is Myositis is in third stage: సమంత యశోద అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఒక రకంగా ఆమె కేవలం తెలుగులోనే కాదు ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, భాషలో కూడా విడుదలై అక్కడి ప్రేక్షకులను అలరించింది. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.
మొదట్లో వసూళ్ల వర్షం బాగానే కురిపించిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు కొంత వరకు తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు కావడంతో పాటుగా కొత్త సినిమాల ఎంట్రీతో దాదాపుగా యశోద కలెక్షన్స్ విషయంలో ఇక ఇబ్బంది పడక తప్పదు అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు సమంత తాను ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని అనౌన్స్ చేసింది.
ఆ తర్వాత సమంత త్వరలో చనిపోతుందా అనే విధంగా మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఆమె మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతోంది. అయితే ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం ఎవరి దగ్గరా లేదు. బహుశా సమంత సన్నిహితుల దగ్గర ఈ వ్యాధికి సంబంధించిన సమాచారం ఉండి ఉండవచ్చు. ఇందులో రెండు మూడు రకాలైన ఇబ్బందులు ఉండడంతో సమంత ఎలాంటి ఇబ్బందితో బాధపడుతుందనే విషయం మీద క్లారిటీ లేదు.
అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కు హాజరైన మరో నటి కల్పిక గణేష్ సమంత జబ్బు గురించి కీలక విషయం బయట పెట్టింది. సమంత ఈ ప్రెస్ మీట్ కి వస్తున్నారని నాకు అబద్ధం చెప్పారని ఆమె వస్తున్నారని తెలిసి తను పరిగెత్తుకుంటూ వచ్చాను అని కల్పిక పేర్కొన్నారు.
అయితే నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది కానీ దానిని క్యాన్సిల్ చేసుకుని వచ్చానని ఆమె పేర్కొన్నారు. సమంతకి ఉన్న మయోసైటిస్ అనే ఇబ్బంది తనకు కూడా 13 ఏళ్ల నుంచి ఉందని అయితే ఇప్పుడు తాను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాను కానీ ఆమె థర్డ్ స్టేజ్ లో ఉందని కల్పిక చెప్పుకొచ్చారు. దీంతో సమంత చాలా ప్రాణాంతకమైన వ్యాధితోనే బాధ పడుతోందని ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు.