Keerthy Suresh: గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్.. హార్ట్ బీట్ పెంచేసిన వెన్నెల
రామ్ పొతినేని సరసన నేను శైలజా చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఇటు తెలుగు, అటు తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కీర్తి ఫుల్ ఫామ్‌లో ఉంది. సర్కారు వారి పాట, దసరా సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది.
దసరా మూవీలో వెన్నెల క్యారెక్టర్‌లో కీర్తి నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా పెళ్లికూతురు గెటప్‌లో వేసిన స్టెప్స్ నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ అఫ్డర్ అనే విధంగా ఉన్నాయి.
తమిళంలోనూ ఉదయనిధి స్టాలిన్ మామన్నన్ సినిమాతో హిట్ అందుకుంది. తెలుగులో ఈ సినిమా నాయకుడి అనే పేరుతో రిలీజ్ అయింది.
హీరోయిన్‌గా బిజీగా ఉండగానే.. చెల్లెలు పాత్రలకు కూడా కీర్తి సురేష్ ఒకే చెబుతోంది. పెద్దన్న మూవీ చెల్లెలు పాత్ర పోషించగా.. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ చిత్రంలోనూ సిస్టర్ రోల్ ప్లే చేస్తోంది.