Krithi Shetty: ట్రెండీ లుక్‌లో కృతి శెట్టి.. చూపులతో మాయ చేస్తున్న బేబమ్మ

Wed, 25 Jan 2023-10:45 pm,

ఈ ముద్దుగుమ్మ నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి మూవీస్ వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.  

ప్రస్తుతం కథల ఎంపికలో బేబమ్మ అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇస్తున్నా.. కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నో చెబుతోందట.   

తెలుగులో నాగ చైతన్య సరసన కస్టడీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా మలయాళంలో టోవినో తోమస్ సరసన ఒక పీరియాడికల్ డ్రామాలో యాక్ట్ చేస్తోంది.

రీసెంట్‌గా కస్టడీ మూవీ నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది.  

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link