Mandana Karimi: దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వచ్చాడు

Tue, 24 Nov 2020-7:47 pm,

కోకో కోలా చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే నిర్మాత మహేంద్ర ధరివాల్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మందన కరిమి ఆరోపించింది.

మహేంద్ర ధరివాల్ తనను మానసికంగా వేధింపులకు గురిచేశాడని.. షూటింగ్‌లో తన వంతు సన్నివేశాలు అయిపోయిన తర్వాత కూడా మరో గంటసేపు ఎక్స్‌ట్రా ఉండాలని వేధించేవాడని సంచలన ఆరోపణలు చేసింది.

తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా తాను దుస్తులు మార్చుకునేటప్పుడు మహేంద్ర ధరివాల్ ( Mahendra Dhariwal ) ఏకంగా క్యారావాన్‌లోకి వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించాడని వాపోయింది. అంతేకాకుండా తనపై నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాడని మందన కరిమి ఆవేదన వ్యక్తంచేసింది.

ఇటీవల పాయల్ ఘోష్ ( Actress Payal Ghosh ) ఇదే తరహాలో అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. పాయల్ ఘోష్ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో వార్తల్లోకెక్కిన మీ టూ ఆరోపణలు ఇవే. ఈసారి మందన కరిమి ( Mandana Karimi ) ఏం చేయనుందో వేచిచూడాల్సిందే మరి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link