Meena Second Marriage: ఒంటరిగా ఉన్న హీరోయిన్ మీనాకు కాబోయే రెండో భర్త అతడేనా..?

Sat, 21 Dec 2024-5:24 pm,
Meena Signals To Ready For Second Marriage

మీనా సినీ ఎంట్రీ: కన్నడ, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన హీరోయిన్‌ మీనా ఒకరు. 1995లో మీనా 'పుట్నంజా' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమెకు వందకు పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.

Meena Signals To Ready For Second Marriage 3

అన్ని భాషల్లో: 90వ దశకంలో అగ్రశ్రేణి హీరోయిన్‌లలో ఒకరిగా మీనా వెలుగొందారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో ఆమె నటించారు.

Meena Signals To Ready For Second Marriage 5

బాలనటిగా: హీరోయిన్‌ కాకముందు బాల నటిగా కూడా మీనా నటించారు. కళ్లు, అందమైన చిరునవ్వు, ముఖరావిందం, అద్భుతమైన నటనతో మీనా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

వివాహం: హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే నటి మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి నైనిక అనే కుమార్తె ఉంది. నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. విజయ్ నటించిన తేరి సినిమాతో నైనికా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.

అకాల మరణం: అకస్మాత్తుగా నటి మీనా భర్త విద్యాసాగర్ 28వ తేదీ జూన్ 2022న మరణించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆయన కన్నుమూయడంతో మీనా దిగ్భ్రాంతికి లోనయ్యింది. భర్త మరణంతో నైరాశ్యంలోకి వెళ్లిన ఆమె ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది.

ఒంటరి జీవితం: ప్రస్తుతం కుమార్తెతో ఒంటరిగా ఉన్న మీనా రెండో వివాహంపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఆమె సన్నిహితులు, కుటుంబీకులు కూడా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అతడిపై క్రష్‌: ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీనా తన రెండో వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. 'నాకు హృతిక్ రోషన్ లాంటి భర్త కావాలని నేను చెప్పా' అని పేర్కొంది. తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రెండో వివాహం: హృతిక్‌ లాంటి వారు లభిస్తే మీనా రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చర్చ నడుస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అయితే ఇది చాలా వరకు అవాస్తవమని.. వాటిని నమ్మవద్దని మీనా కొట్టి పారేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link