Virat Kohli: విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..!
విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు హాడల్. అదే స్టేడియంలో, టీవీల ముందు కుర్చుకున్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంటారు. ఇలా కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ ఓ స్టార్ హీరోయిన్ కూడా ప్రేమలో పడిపోయింది.
సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. హాయ్ నాన్న మూవీతో మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఈ భామ కోహ్లీకి వీరాభిమాని.
ఓ ఇంటర్వ్యూలో విరాట్‌పై తన ప్రేమను వ్యక్తపరిచింది మృణాల్. తాను ఒకప్పుడు కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డానంటూ చెప్పుకొచ్చారు.
తన సోదరుడి కారణంగా తాను క్రికెట్ చూడటం ప్రారంభించానని.. బ్లూ జెర్సీ ధరించి టీమిండియాను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వెళతామని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే కోహ్లీ బ్యాటింగ్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని తెలిపింది.
మృణాల్ స్పోర్ట్స్‌లో మంచి ఎక్స్‌పర్ట్. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్‌లో జిల్లాస్థాయి వరకు ఆడింది.
ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది మృణాల్. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందులేకపోయింది.