నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో గ్యాలరీ

Fri, 14 Aug 2020-5:02 pm,

నాగబాబు కూతురు, మెగా డాటర్‌గా పేరొందిన నిహారిక కొనిదెల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం పూర్తయింది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఎంగేజ్‌మెంట్ జరిగింది.

నిహారిక ఎంగేజ్ మెంట్ వేడుకలో కాబోయే కొత్త జంటను ఆశీర్వదించిన చిరంజీవి, సురేఖ దంపతులు

రాంచరణ్, ఉపాసన దంపతులు నిహారిక ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

చైతన్య జొన్నలగడ్డ-నిహారికల పెళ్లికి రెండు కుటుంబాల వైపు నుంచి పూర్తి అంగీకారం ఉంది. ఇరు కుటుంబాలు ఇష్టపడి, కుదిర్చి చేసుకుంటున్న పెళ్లి ఇది. 

చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడబోతున్నట్టుగా గత నెలలోనే నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు కుటుంబాల వైపు నుంచి పూర్తి అంగీకారంతో జరుగుతున్న ఈ పెళ్లి ఇరు కుటుంబాల్లో ఆనందాలు మోసుకురావాలని కోరుకుందాం.

నిహారిక సినిమాల జాబితా విషయానికొస్తే.. సూర్యకాంతం, ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నిహారిక హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంలోనూ నిహారిక ఒక చిన్న పాత్ర పోషించింది.

చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడబోతున్నట్టుగా గత నెలలోనే నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు కుటుంబాల వైపు నుంచి పూర్తి అంగీకారంతో జరుగుతున్న ఈ పెళ్లి ఇరు కుటుంబాల్లో ఆనందాలు మోసుకురావాలని కోరుకుందాం.

ఈ ఏడాది చివర్లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం ఉండనున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నిహారిక - చైతన్య జొన్నలగడ్డ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల వైపు నుంచి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కొవిడ్-19 మార్గదర్శకాల దృష్ట్యా అతికొద్ది మంది సమీపంలోనే ఈ వేడుకను పూర్తిచేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link