Pooja Hegde: రోజా పువ్వు రెక్కల డ్రెస్సులో..రోజాలా మెరిసిపోయిన పూజా హెగ్డే..
నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుందా సినిమాలో సైతం కనిపించింది. మొదటి రెండు చిత్రాలలో కూడా ఎంతో పద్ధతిగా కనిపించి ట్రెడిషనల్ హీరోయిన్ గా మెప్పించండి.
అయితే సడన్ గా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి ఐటెం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా అదృష్టం కొద్దీ ఈ హీరోయిన్ కి ఈ ఐటెం సాంగ్ చేసిన తర్వాత నుంచి అవకాశాలు మరిన్ని ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే చేసిన అరవింద సమేత, అలా వైకుంఠపురం లో చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా ఇక పూజ హెగ్డేకి ఎదురు లేదు అనుకున్న దగ్గర నుంచి సమస్యలు అన్ని మొదలయ్యాయి.
గత రెండు సంవత్సరాల నుంచి ఈ హీరోయిన్ చేసిన చిత్రాలు అన్ని అపజయం పాలవుతూవస్తున్నాయి. ఈ క్రమంలో ఈ హీరోయిన్ త్వరలోనే సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా చేయనుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ సినిమాల విషయం పక్కనపెడితే.. పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అభిమానులను తరచూ అలరిస్తూఉంటుంది. ముఖ్యంగా పూజా హెగ్డే రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.