Pooja Hegde Saree Pics: చీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
పూజా హెగ్డే 1990 అక్టోబరు 13న ముంబైలో జన్మించింది. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.
2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీరంగ ప్రవేశం చేసింది. 2014లో వచ్చిన 'ముకుంద' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
గత కొన్నేళ్లుగా ఈ బ్యూటీ చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు అవకాశాలు కరవయ్యాయి. ప్రస్తుతం తమిళ, హిందీల్లో మాత్రం సినిమాలు చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో పూజా హెగ్దే ఒకరు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ చీరలో మెరిసింది. ఇందులో చూడటానికి కొత్త పెళ్లికూతురులా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.