Pooja Hegde: బ్యాక్ ఇన్ బ్లాక్.. పూజా హెగ్డే అందాల విందు అదుర్స్
బ్లాక్ శారీలో మెరుపులు మెరిపించింది పూజా హెగ్డే. పరువాల విందులో హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. 2014లో వచ్చిన వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తక్కువ సినిమాలతోనే పుజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం పూజాకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది ఈ ముద్దుగుమ్మ నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి.
మహేష్-తివిక్రమ్ కాంబో తెరకెక్కుతున్న మూవీ వరుసగా వాయిదాలు పడుతోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆఫర్ క్లారిటీ లేదు. మరోవైపు సోషల్ మీడియాలో బుట్టబొమ్మ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసుకుంటోంది.