Pooja Hegde Pics: పర్పుల్ లెహంగాలో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ వయ్యారాలు చూడతరమా!

Thu, 02 Feb 2023-4:37 pm,

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పర్పుల్ లెహంగాలో హాట్ పోజులు ఇచ్చారు. బుట్టబొమ్మ వయ్యారాలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే నిత్యం హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

పూజా హెగ్డే చివరగా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశే మిగిల్చాయి. వరుస డిజాస్టర్స్ పడినా పూజాకు అవకాశాలు తగ్గడం లేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తున్నారు.   

ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజాకు మంచి పేరు వచ్చింది.   

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో వచ్చిన 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  

1990 అక్టోబరు 13న ముంబైలో పూజా హెగ్డే జన్మించారు. శ్రీమతి ఎంఎంకే కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో పూజా రెండో స్థానంలో నిలిచారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link