Pooja RamaChandran Baby Bump: పూజా రామచంద్రన్ బేబీ బంప్.. వైరల్ పిక్స్!
ప్రస్తుతం పూజా రామచంద్రన్ గర్భవతి. ఈ విషయాన్ని ఆమె ఇటీవల అధికారికంగా ప్రకటించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోస్ పూజా షేర్ చేశారు.
విజె క్రేప్గ్ అనంతరం 2019లో జాన్ కొక్కెన్‌ను పూజా రామచంద్రన్ వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పూజా తన భర్తతో చేసే రొమాన్స్‌ను చూసి అంతా ఫిదా అవుతుంటారు.
పలు సినిమాలలో నటించిన పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యారు.
అడవి కాచిన వెన్నెల, దోచేయ్, త్రిపుర, సిద్ధార్థ, మరల తెలుపనా ప్రియా, ఇంతలో ఎన్నెన్ని వింతలో, దేవి శ్రీ ప్రసాద్, కృష్ణార్జున యుద్ధం, వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే లాంటి తెలుగు సినిమాలలో పూజా రామచంద్రన్ నటించారు.
'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో పూజా రామచంద్రన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే 'స్వామి రారా' సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.
1984 మార్చి 22న పూజా రామచంద్రన్ బెంగుళూరులో జన్మించారు. కోయంబత్తూరులోని బిషప్ అప్పసామి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి డిగ్రీ పట్టా పొందారు.