Raashii Khanna Pics: శారీలో మెరిసిన రాశి ఖన్నా.. అందానికే అసూయ పుట్టేలా..!

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. అందం, అభినయం ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి.

బెంగాల్ టైగర్, వెంకీమామ, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రాశి. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలసిరావడం లేదు.
రాశి ఖన్నా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. గతేడాది పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు పెద్దగా ఆకట్టులేదు.
దీంతో ఈ బ్యూటీ ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది రాశి ఖన్నా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.