Actress Ramya: ప్లీజ్.. ఆ వీడియోలను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య.. మ్యాటర్ ఏంటంటే..?
కన్నడ భామ, మైసూర్ మాజీ ఎంపీ తాజాగా.. కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో .. "హాస్టల్ హుడుగారు బెకగిద్దరే" సినిమాలోని తన సన్నివేశాలను తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించి పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ సినిమాలో తన అనుమతి లేనిదే వీడియోను ఉపయోగించుకున్నారన్నారు.
ఈ సన్నివేశాలను తొలగించాలని ఎన్నిసార్లు మూవీ టీమ్ కు చెప్పిన స్పందించలేదన్నారు. అంతే కాకుండా.. కోటి రూపాయల పరిహారం కూడా నటి రమ్య డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా..హాస్టల్ హుడుగారు బెకగిద్దరే మూవీలో కొన్ని క్లిప్పింగ్ లను ఉపయోగించుకున్నారని.. అది తనకు ఏ మాత్రం చెప్పకుండా వాడుకున్నట్లు నటి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పలు మార్లు ఈ సినిమాలోని సన్నివేశాలను క్లిప్పింగ్ లను తొలగించాలని కూడా నిర్మాతలకు చెప్పానని.. ఆయిన కూడా మూవీ సంస్థ నిర్మాతలు దీన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. రమ్య గతంలో మైసూర్ ఎంపీగా కూడా పనిచేశారు.. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన "హాస్టల్ హుడుగారు బెకగిద్దరే".. ఒక బ్లాక్ కామెడీ-డ్రామా చిత్రం. ఈ మూవీకి మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలోని తన క్లిప్పింగ్ లు ఉన్న వీడియోలను తొలగిస్తే.. తాను కేసును ఉపసంహరించుకుంటానని కూడా నటి రమ్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రమ్య వేసిన కేసు మాత్రం ఇండస్ట్రీలో చర్చ నీయాంశంగా మారింది.