Rashami Desai: కోట్లు సంపాదించి అప్పులపాలైన స్టార్ నటి.. రోడ్డుపై పడుకుని.. రూ.20 భోజనం తింటూ..!
రష్మీ దేశాయ్.. ఈ పేరు మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ బాలీవుడ్‌లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం. మొదట బి గ్రేడ్ సినిమాల్లో నటించిన రష్మీ దేశాయ్.. ఉత్తరన్ అనే సీరియల్‌లో తపస్య పాత్రలో నటించి రాత్రికి రాత్రే స్టార్‌గా మారింది. అయితే ఈ బ్యూటీ కోట్లు సంపాదించినా.. చివరికి చాలా కష్టాలను ఎదుర్కొంది. తాజాగా బ్రూట్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది.
ఆమె తన పాత రోజులను గుర్తు చేసుకుంది. తాను ఇల్లు కొన్నానని.. ప్రస్తుతం తనకు రూ.2.5 కోట్ల అప్పు ఉందని.. అంతేకాకుండా రూ.3.5 కోట్ల లోన్ ఉందని తెలిపింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో హిట్ షో ఆగిపోవడంతో ఇబ్బందులు పడినట్లు పేర్కొంది.
తాను నాలుగు రోజులు రోడ్డుపైనే తన కారులో పడుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. రిక్షా వాళ్లతో కలిసి రూ.20 రోజుల భోజనం కూడా తిన్నానని గుర్తు చేసుకుంది. తన సామాన్లు అన్ని మేనేజర్ ఇంట్లో భద్రపరిచి.. కుటుంబానికి దూరంగా ఉన్నానని వెల్లడించింది.
'నా గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నేను ప్రతిదానిలో కష్టాలను ఎదుర్కొన్నాను. నేను అన్ని మర్చిపోయాను. భర్తతో నేను విడాకులు తీసుకున్నాను. నా స్నేహితులు కూడా దూరం పెట్టారు. అప్పటివరకు నా నిర్ణయాలన్నీ తప్పని మా కుటుంబం భావించింది." అని రష్మీ దేశాయ్ చెప్పుకొచ్చింది.
రష్మీ దేశాయ్ చాలా షోలలో వర్క్ చేసింది. ఉత్తరన్ సీరియల్‌తో పాటు 'దిల్ సే దిల్ తక్', 'బిగ్ బాస్ సీజన్ 13' షోలలో కూడా పాల్గొంది. 2011లో నటుడు నందీష్ సంధును వివాహం చేసుకోగా.. కొద్దిరోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఆమె ప్రస్తుతం టీవీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగారు. ఇప్పుడు 5 అపార్ట్‌మెంట్లు, అనేక ఖరీదైన కార్లతో కలిగి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రస్తుతం రష్మీ దేశాయ్ నికర విలువ రూ.10 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.