Sai Pallavi: బాలీవుడ్ పీఆర్ టీం పై షాకింగ్ కామెంట్ చేసిన సాయి పల్లవి..!
తెలుగు ఇండస్ట్రీలో ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈమె నటించే పాత్ర ఏదైనా సరే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. అందులో భాగంగానే హిందీ రామాయణం లో నటిస్తూ ఉండగా.. రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా నటిస్తోంది.
ఈ మేరకు బాలీవుడ్ లో ఈమెకు మార్కెట్ లేని నేపథ్యంలో పీఆర్ టీం పెట్టుకుంటే మీ క్రేజ్ పెరుగుతుంది కదా అంటూ కామెంట్ చేయగా.. దానికి తనదైన రీతిలో సమాధానం తెలిపింది.
సాయి పల్లవి మాట్లాడుతూ..” పీఆర్ టీం పెట్టుకుంటే క్రేజ్ పెరుగుతుంది. కానీ జనాల్లోకి ఎక్కువగా మనం వెళ్తే వారికి బోర్ కొడతాము. అందుకే నాకు పీఆర్ టీమ్ అవసరం లేదు. నా టాలెంట్ తోనే నేను ఎదగాలి. అప్పుడే నాకు గుర్తింపు రావాలి అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది”.
మొత్తానికి అయితే పిఆర్ టీమ్ పెట్టుకున్న సెలబ్రిటీలకు గట్టి ఝలక్ ఇచ్చింది.. సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ నటించిన అమరన్ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సాయి పల్లకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.