Samantha: ఆ ఒక్క పని మాత్రం చేయలేను.. సమంత బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Tue, 05 Nov 2024-2:33 pm,

ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత సమంత.. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు కారణంగానే సమంత, విజయ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా కూడా ఎంతో ఆలస్యమైంది.

యశోద, శాకుంతలం, ఖుషీ ఈ మూడు సినిమాల విడుదలకు ముందు సమంత తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే ఆ సమస్యల నుంచి.. తనను తాను బయటపెట్టి.. ఫైనల్ గా ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేసింది. 

ముందుగా యశోద సినిమా విడుదల కాక ఆ తర్వాత.. కొద్ది గ్యాప్ ఇచ్చి శాకుంతలం, ఖుషీ.. చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఈ చిత్రాలలో యశోద, ఖుషి సినిమాలు సమంతకు ఒక మోస్తారు విజయాన్ని అందించాయి. కాగా ఆ తరువాత మళ్లీ కొద్ది రోజులు షూటింగులకు గ్యాప్ ఇస్తూ వచ్చింది ఈ హీరోయిన్. 

ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈమె నటించిన.. వెబ్ సిరీస్ సీటాడెల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న సమంత.. తాజాగా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది…

ఈ నేపథ్యంలో ఒక అభిమాని సమంతను లావు అవ్వమని కోరగా.. తాను  మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని.. కాబట్టి బరువు పెరిగే ఒక పని మాత్రం తాను ఎప్పుడు చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. అందుకు ముఖ్య కారణం డాక్టర్ తనకు డైట్ ఇచ్చిందని.. తాను ఆ డైట్ మాత్రమే ఫాలో కావాలని చెప్పుకొచ్చింది.   

ఇక ఈ మధ్య సమంత.. చాలా సన్నగా అయిపోయిందని తన ఫోటోలు చూసినా అభిమానులు బాధపడిన సంగతి తెలిసిందే. ఇక వారికి సమంత చెప్పిన ఈ మాటలతో సమాధానం వచ్చింది. ఇక సమంత చెప్పిన మాటలు విని ఆమె అభిమానులు మాత్రం కొంత నిరాశకు గురవుతున్నారు. సమంత ఇంకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని తనకు త్వరగా బాగా అవ్వాలని కోరుకుంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link