Shilpa Shetty: వైష్ణో దేవీ ఆలయంలో నటి శిల్పాశెట్టి.. మదర్స్ డేకు ముందు భలే సర్ ప్రైజ్.. ఫోటోలు వైరల్..
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన తల్లి సునంద శెట్టి, సోదరి షమిత, ఆమె కుమార్తె సమీషా తో కలిసి వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. శిల్పా తన ఇన్ స్టాలో ఆలయంను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
మదర్స్ డేకు ముందు రోజు ఇలా వైష్ణోదేవీ ఆలయంను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని శిల్పా చెప్పుకొచ్చారు. అక్కడి ఆధ్యాత్మికమైన వాతావరణంను శిల్పాశెట్టి ఆమె తల్లి సునంద శెట్టి, సమీషా ఫుల్ ఎంజాయ్ చేశారు.
తన తల్లి,శిల్పా, సమీషా గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టుకుని తమ ప్రేమను చూపిస్తున్నారు. తన తల్లికి శిల్పా మదర్స్ డే సందర్బంగా విషేస్ చెప్పారు. ఇప్పుడు, ఎప్పటీకి నిన్ను ప్రేమిస్తునే ఉంటానని తన తల్లికి మదర్స్ డే అడ్వాన్స్ విషేస్ చెప్పారు.
శిల్పాశెట్టి కేదార్‌నాథ్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత వైష్ణోదేవికి ప్రత్యేకమైన చాపర్ లో బయలుదేరింది. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున, ఆమె ఉత్తరాఖండ్ సుందరమైన ప్రదేశాలను, అందమైన గులాబీ తోట యొక్క సంగ్రహావలోకనాలను ఇన్ స్టాలో పంచుకున్నారు.
శిల్పాశెట్టి మంచుతో కప్పబడిన అందమైన పర్వతాల దృశ్యాన్ని కలిగి ఉన్న మరొక వీడియోను ఇన్ స్టాలో అప్‌లోడ్ చేసింది. శిల్పా “కేదార్‌నాథ్”, “బకెట్ లిస్ట్” అనే హ్యాష్‌ట్యాగ్‌లతో వీడియోను షేర్ చేసింది.
ఆ తర్వాత.. శిల్పాశెట్టి చాపర్‌లో వైష్ణోదేవికి బయలుదేరింది. ఆమె తన ఛాపర్ ల్యాండ్ అవుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. వీడియోలోని హ్యాష్‌ట్యాగ్‌లు “వైష్ణోదేవి”, “కత్రా.” అంటూ పోస్ట్ చేశారు. శిల్పా శెట్టి చిన్న కుమార్తె సమీషా శెట్టి కూడా ఈ పర్యటనలో ఉన్నారు. సమీషా, శిల్పాశెట్టి “జై మాతా ది” అంటూ భక్తితో నినాదాలు చేశారు.